చిత్రం: పరుగు
గాయకుడు: సాకేత్
గీత రచయిత: అనంత శ్రీరామ్
సంగీత దర్శకుడు: మణిశర్మ
పల్లవి:
నమ్మవేమో గాని… అందాల యువరాణి
నేలపై వాలింది… నాముందే మెరిసింది
నమ్మవేమో గాని… అందాల యువరాణి
నేలపై వాలింది… నాముందే మెరిసింది
అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది
ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది
నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది
అదేదో మాయలో… నన్నిలా.. ముంచివేసింది
నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది
అదేదో మాయలో… నన్నిలా.. ముంచివేసింది –
చరణం 1:
నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే
చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే
చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే
రూపం ఈడు భారాలై ముందర నుంచుంటే
ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే
అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
చరణం 2:
వేకువలోన ఆకాశం ఆమెను చేరింది
ఓ క్షణమైనా అదరాల రంగుని ఇమ్మంది
వేసవి పాపం చలి వేసి ఆమెను వీడింది
శ్వాసలలోన తల దాచి జాలిగ కూర్చుంది
ఆ అందమంత నా సొంతమైతే
ఆనందమైన వందేళ్ళు నావే
కలల తాకిడిని మనసు తాళదిక వెతికి చూడు చెలిని
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది…